: పొన్నం 'ఒక తీవ్రవాది'లా మాట్లాడటం సరికాదు: లగడపాటి


కరీంనగర్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఆయన హెలికాప్టర్ ను పేల్చేస్తామని నిన్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఒక బాధ్యత గల ఎంపీగా ఉంటూ... దాడులు చేస్తాం, పేల్చేస్తాం అంటూ తీవ్రవాదిలా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. పొన్నం తనకు తానే ఆలోచించుకుని, తప్పును సరిదిద్దుకుంటారని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

దీనికి తోడు శ్రీధర్ బాబుపై మాట్లాడుతూ, ఆయన శాసనసభ వ్యవహారాల శాఖతో ఏంచేస్తారని లగడపాటి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి ఆయనకు వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారని చెప్పారు. ముఖ్యమంత్రికి, శ్రీధర్ బాబుకి మంచి సంబంధాలు ఉన్నాయని... వారి మధ్య తాను తలదూర్చనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News