: నేడు, రేపు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల 'సంకల్ప దీక్ష'
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు, రేపు 'సంకల్ప దీక్ష'ను చేపడుతున్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ దీక్షను నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, సబ్బం హరి పాల్గొంటున్నారు.
తెలంగాణ వారిపై కూడా తమకు అంతులేని ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయని... అందుకే అందరం కలసి ఉండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఎంపీలు తెలిపారు. తాము చేపడుతున్న దీక్ష ఎవరినో వ్యతిరేకించేందుకో, రెచ్చగొట్టేందుకో కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దీక్షాస్థలి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా దీక్షను నిర్వహించాలని ఎంపీలను పోలీసు అధికారులు కోరారు.