: ఉగ్రవాదులను ఉరితీసినందుకే ఈ దాడులు: షిండే
ఉగ్రవాదులు అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ ను ఉరితీసినందుకు ప్రతీకారంగానే దేశంలో దాడులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే చెప్పారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు, తాజాగా బుధవారం శ్రీనగర్ లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి నేపథ్యంలో షిండే లోక్ సభలో ఒక ప్రకటన చేశారు.
దాడులు జరగొచ్చని తాము ముందే ఊహించామని తెలిపారు. బుధవారం శ్రీనగర్ లోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి వెనుక విదేశీ హస్తం ఉందని వెల్లడించారు. దాడి చేసిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు పాకిస్థాన్ లో తయారైనవని షిండే చెప్పారు.