: కాంగ్రెస్-గంగానది... రెండూ ఒకటే!: సీఎం కిరణ్


కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దేశంలోనే అతి పెద్దదైన, పవిత్రమైన  గంగానదితో పోల్చారు. ఈ రెండు ఒకటేనంటున్నారు. ఎలా అని ఒకసారి లోతుగా చూస్తే.. ఎంతోమంది వచ్చి ఆ గంగా ప్రవాహంలో స్నానం చేసి వెళ్లినట్లుగానే.. ఎన్నో పార్టీలు కూడా కాంగ్రెస్ లో విలీనమై మళ్లీ బయటికి పోతుంటాయని వ్యాఖ్యానించారు. అందుకని విలీనాల వంటి విషయాలను అధిష్ఠానం చూసుకుంటుందని సిఎం అన్నారు. 

ఇక తెలంగాణ అంశం అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ సమస్యని సీఎం
 పేర్కొన్నారు. దీనిపై కేంద్రం నిర్ణయం ప్రకటించాక, రాష్ట్ర అసెంబ్లీలో ఏదైనా చేయాల్సి వుంటే చేసుకోవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారుఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని కిరణ్ సూచించారు.

అవిశ్వాస తీర్మానం వల్ల 
ప్రభుత్వం కూలిపోతుందని ఎవరూ అనుకోవడం లేదన్నారు. మాటిమాటికి అవిశ్వాసం అంటూ తమను అస్థిరపరిచే యత్నం చేస్తున్నారన్నారు. కానీ, అవిశ్వాసం వల్ల కాంగ్రెస్ ఇంకా లాభపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీయే తమ ప్రధాన ప్రత్యర్ధి అని కిరణ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News