: వీహెచ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ విజయయాత్ర ప్రారంభం


మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఇందిరమ్మ విజయయాత్ర ప్రారంభమైంది. ఆమనగల్ మండల పరిధిలోని కడ్తాల్ లో ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా విజయయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈ యాత్ర చేపడుతున్నట్లు వీహెచ్ ప్రకటించిన విషయం విదితమే. దేశాభివృద్ధికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సేవలకు గుర్తింపుగా యాత్రకు ఇందిరమ్మ పేరు పెట్టినట్టు ఆయన చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వీహెచ్ ఈ యాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News