: విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో ఐదు గంటలకు ఓటింగ్
ఢిల్లీ అసెంబ్లీలో మంత్రి మనీష్ శిసోడియా ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీర్మానంపై సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ బలాన్ని నిరూపించుకోనుంది. ప్రస్తుతం ఏఏపీకి కాంగ్రెస్ బయటినుంచి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బల నిరూపణను నెగ్గుతామని ఏఏపీ ధీమాగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది.