: 27 శాతం మధ్యంతర భృతికి అంగీకరించిన ప్రభుత్వం


ఎట్టకేలకు ఉద్యోగ సంఘాల నేతలకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రితో దాదాపు గంటకు పైగా జరిపిన చర్చల్లో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెప్పారు. దీంతో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చర్చలు ఫలవంతంగా ముగిశాయి. హామీ ప్రకారం జనవరి 1, 2014 నుంచి ఈ మధ్యంతర భృతిని అమలు చేయనున్నారు. దాంతో, ప్రభుత్వంపై రూ.1900 కోట్ల అదనపు భారం పడనుంది. దీనికి తోడు ఫిబ్రవరి నెలాఖరులోగా పీఆర్సీని ఏర్పాటు చేస్తామని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. మరికాసేపట్లో మధ్యంతర భృతికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News