: థానే బస్సు ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య


మహారాష్ట్రలో ఇవాళ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. థానే జిల్లాలో విఠల్ వాడి-అహ్మద్ నగర్ ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కి చేరింది. మరి కొంత మంది క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో 18 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. మరో 17 మందిని రక్షించి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, సమీపంలో సెల్ టవర్లు లేకపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. దీంతో సహాయక చర్యల సమన్వయం కష్టమవుతోందని అధికారులు వెల్లడించారు. ప్రాధమిక చికిత్స అందించేందుకు సంఘటనా స్థలానికి వైద్య బృందాన్ని పంపినట్లు థానే రూరల్ అడిషనల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News