: కాళ్లబేరాలకు దిగేవాళ్లా మమ్మల్ని విమర్శించేది?: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండింటికి ప్రభుత్వాన్ని పడగొట్టే ఉధ్ధేశం ఉంటే విడివిడిగా అవిశ్వాసం తీర్మానం నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో కాళ్లబేరాలు చేసే పార్టీలు ఇప్పుడు తమను విమర్శించేందుకు సాహసిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు లొంగేదిలేదని పేర్కొన్నరేవంత్.. 2004లో కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో వివరించాలన్నారు. టీడీపీ వైఖరితో ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందంటున్న కేసీఆర్ కు ఆ మాట అనే అర్హత లేదన్నారు.