: ఇరాన్ లో భూకంపం
దక్షిణ ఇరాన్ లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. బస్తక్ పట్టణం దగ్గర్లో ఈ తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఒకరు మృతి చెందారని, 12 మంది గాయపడ్డారని, పలు భవనాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాగా ప్రమాద నష్టం పూర్తిగా అందలేదు. అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.