: సచివాలయంపై దాడులు చేస్తాం: ఏసీబీ డీజీ ఏకే ఖాన్


అవినీతిని ఏమాత్రం సహించేది లేదని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వంలోని అత్యంత అవినీతి శాఖలను గుర్తించామని... వాటిలో రెవెన్యూ మొదటి స్థానంలో, హోంశాఖ రెండో స్థానంలో, పంచాయతీ రాజ్ మూడో స్థానంలో నిలిచాయని చెప్పారు. ఆయా శాఖల్లో అత్యంత అవినీతిపరులను గుర్తించి, వారిని వలవేసి పడతామని చెప్పారు. అవినీతికి అడ్డాగా మారిన సచివాలయాన్ని కూడా వదలమని, సమయం చూసి దాడులు చేస్తామని అన్నారు.

ఎక్కువ అవినీతికి పాల్పడుతున్న వారిపై పూర్తి సమాచారాన్ని సేకరించామని ఏకే ఖాన్ తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారిని కూడా వదలమని హెచ్చరించారు. అవినీతిపరులను పట్టుకునే విషయంలో ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు.

  • Loading...

More Telugu News