: విశ్వాస పరీక్ష అంటే భయం లేదు.. ఎన్నాళ్లున్నా నష్టం లేదు: కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గురించి తనకు భయం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్నాళ్లు అధికారంలో ఉన్నా, ఇప్పుడే మద్దతు లభించకపోయినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. కాగా సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.