: ఇక బుక్కు చూసి పరీక్ష రాసేయ్ గురూ!


పాశ్యాత్య దేశాల తరహా విద్యా విధానాన్నిఇక మనదేశంలోనూ చూడొచ్చు! వచ్చే ఏడాది మార్చి నుంచి సీబీఎస్ఈ విధ్యావిధానంలో ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అంటే, పరీక్ష పత్రంలోని ప్రశ్నలకు జవాబులను పాఠ్య పుస్తకాల్లో వెతికి రాయాలన్నమాట.

అయితే, ఈ విధానం పది, తొమ్మిదో తరగతి విద్యార్థులకేనట. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శశి థరూర్ లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఈ విషయాన్నివెల్లడించారు. సమ్మెటిక్ అసెస్ మెంట్-2 పేరిట ఈ పరీక్షలు ఉంటాయని థరూర్ తెలిపారు.

కేస్ స్టడీ సెక్షన్ పేరుతో ప్రశ్నాపత్రం ఉంటుందని,  అందుకు అవసరమైన సామగ్రిని పాఠశాలలకు పంపుతామని ఆయన చెప్పారు. ఈ పరీక్ష విధానం పట్ల ఉపాధ్యాయులకు ముందస్తు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. 

  • Loading...

More Telugu News