: లేస్ ప్రచారకుడిగా రణబీర్
లేస్ చిప్స్ కు ఇకపై బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయనున్నారు. 2008 నుంచీ రణబీర్ పెప్సీకో కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ కు ప్రచారకుడిగా ఉన్నారు. ఇకపై లేస్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేయనున్నారని పెప్సీకో ఇండియా ప్రకటించింది. తద్వారా మరింత మంది యువతను చేరుకోవడానికి కంపెనీకి ఉపకరిస్తుందని పెప్సీకో ఇండియా ఫుడ్స్ డైరెక్టర్ గౌరవ్ చెప్పారు.