: ఇప్పుడు పెళ్లి ముఖ్యం కాదు: కంగనా


ప్రస్తుతానికి పెళ్లి ముఖ్యం కాదని, దానికంటే ముఖ్యమైనవి వేరే ఉన్నాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటోంది. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు లేవని, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నానని చెప్పింది. 'పెళ్లంటే, తోడు, కట్టుబాటు. నాకెవరి తోడు అక్కర్లేదు. నాకు నేనే తోడు. వంటచేయడం, డాన్స్ అంటే ఎంతో ఇష్టం, ఎవరికి వారే తోడుగా జీవించడం ఒక వరం' అని పేర్కొంది. కంగనా నటించిన క్వీన్ చ్సినేమా విడుదలకు సిద్ధంగా ఉంటే.. మరో సినిమా 'రివాల్వర్ రాణి' కూడా పట్టాలెక్కనుంది. ఈ రెండూ మహిళ ప్రధాన కథాంశంగా ఉన్నవే.

  • Loading...

More Telugu News