: ఆసుపత్రిలో చేరిన పర్వేజ్ ముషారఫ్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగానే ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముషారఫ్ భద్రత కారణంగా ఇప్పటికి రెండుసార్లు ప్రత్యేక కోర్టుకు గైర్హాజరయ్యారు. దాంతో, న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ముషారఫ్ ను ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ లో చేర్చినట్లు లాయర్ మహ్మద్ తెలిపారు.