: 15 కోట్లకు పెరగనున్న భారత మొబైల్ నెటిజన్ల సంఖ్య
స్మార్ట్ ఫోన్ల రాకతో మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి రావడంతో, మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మార్చి చివరికల్లా వీరి సంఖ్య 15 కోట్లను దాటనుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది. జూన్ చివరి నాటికి వీరి సంఖ్య 19 కోట్లకు చేరువవుతుందని అంచనా వేసింది. ప్రతి త్రైమాసికానికీ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 20 శాతం మేర పెరుగుతోందని చెప్పింది.