: హోమ్ నుంచి నలుగురు యువతుల పరారీ
హైదరాబాద్ యూసఫ్ గూడలోని స్టేట్ హోం నుంచి నలుగురు యువతులు ఈ ఉదయం పరారయ్యారు. పరారైన నలుగురిలో ఇద్దరు కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ హోంలో చేరిన వారు కాగా, మరో ఇద్దరు అనాధ యువతులు. వీరు నలుగురు పకడ్బందీ రక్షణ ఏర్పాట్లను ఛేదించుకుని, ప్రహారీ గ్రిల్స్ తొలగించి పారిపోయినట్టు ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. కాగా వీరిలో ఒక యువతి తన మూడేళ్ల కుమారుడిని తీసుకుని మరీ వెళ్లిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.