: సంక్రాంతి స్పెషల్: విశాఖ, తిరుపతిలకు మరిన్ని రైళ్లు


సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖ, తిరుపతిలకు ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచిన విషయం విదితమే. ఇవాళ్టి నుంచి ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. తిరుపతి-ఔరంగాబాదు మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య రెండు ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లను ఏర్పాట్లు చేసినట్లు రైల్వే సీపీఆర్వో ప్రకటించారు.

నంబరు 07405 ఔరంగాబాద్-తిరుపతి ప్రత్యేక రైళ్లు శుక్రవారాల్లో సాయంత్రం 6.40 గంటలకు.. అంటే ఈ నెల 10, 17, 24, 31 తేదీల్లో బయల్దేరి శనివారం సాయంత్రం 7 గంటలకు తిరుపతి చేరుతాయి. నంబరు 07406 తిరుపతి-ఔరంగాబాదు ప్రత్యేక రైళ్లు శనివారాల్లో రాత్రి 9.15 గంటలకు.. అంటే ఈ నెల 11, 18, 25 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో బయల్దేరి ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఔరంగాబాద్ చేరుతాయి. ఈ ప్రత్యేక రైళ్లను.. జాలా, పర్బనీ, పూర్ణా, నాందేడ్, మత్కేడ్, బాసర, నిజామాబాదు, కామారెడ్డి, సికింద్రాబాదు, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, రేణిగుంట స్టేషన్లలో మాత్రమే నిలుపుతారు.

నంబరు 02740 సికింద్రాబాదు-విశాఖ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు ఈ నెల 12వ తేదీ, ఆదివారం రాత్రి 10.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.35 గంటలకు విశాఖ చేరుతుంది. నంబరు 02739 విశాఖ-సికింద్రాబాదు ప్రత్యేక రైలు ఈ నెల 13వ తేదీ, సోమవారం రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాదుకు చేరుతుంది. ఈ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలును.. కాజీపేట, వరంగల్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో మాత్రమే ఆపుతారు.

  • Loading...

More Telugu News