: కుక్కను కొట్టాడని.. వ్యక్తికి యాభై రూపాయాల జరిమానా!


ఓ వ్యక్తి  అకారణంగా కుక్కను కొట్టాడన్న కారణంతో అతనికి జరిమానా విధించిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, బోడుప్పల్ సూర్యా హిల్స్ కు చెందిన టీనా అనే మహిళ ఓ కుక్కను పెంచుకుంటోంది. దాన్ని హన్మంతరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా కొట్టడంతో దాని రెండు కాళ్లు విరిగిపోయాయట.

ఇంకేముంది, అల్లారుముద్దుగా పెంచుకునే కుక్క బాధతో విలవిల్లాడుతుంటే తట్టుకోలేకపోయిన యజమానురాలు టీనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, మేడిపల్లి పోలీసులు హన్మంతరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. బుధవారం న్యాయస్థానంలో హాజరుపర్చగా, అతనికి యాభై రూపాయల జరిమానా విధించారు.

  • Loading...

More Telugu News