: ఆంగ్ల సంవత్సరాదిన తిరుమలలో తగ్గిన భక్తులు


ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నిన్న (బుధవారం) తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. సంవత్సరం తొలి రోజు తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వీఐపీలకు పరిమితంగా పాసులు జారీ చేయడంతో భక్తులకు దర్శనం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 3,342 వీఐపీ పాసులు జారీ చేయగా.. 3,169 పాసులు కొనుగోలు చేసి వినియోగించుకొన్నారు. వీఐపీ తాకిడి తగ్గడంతో భక్తులు వెయ్యి రూపాయలు వెచ్చించి పాసులు కొనుగోలు చేశారు.

ఈ నెల 11న వైకుంఠ ఏకాదశి కావడంతో, ప్రముఖులు ఆ రోజు వెంకన్న దర్శనానికి మొగ్గు చూపడంతో వీఐపీల సంఖ్య తగ్గినట్లు సమాచారం. తెల్లవారుజామున 4 గంటల వరకు వీఐపీల దర్శనాన్ని పూర్తిచేశారు. అనంతరం సామాన్య భక్తులను ధర్మ దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ తగ్గడంతో.. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అవకాశం కల్పించారు. ఇక, దివ్యదర్శనానికి 25 వేల పాసులు జారీ చేయగా.. కాలినడకన తిరుమల చేరుకొన్న భక్తులు 16 వేల టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం భక్తులకు అన్న ప్రసాదాలను అందించేందుకు టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేసింది.

  • Loading...

More Telugu News