: ప్రజాహిత వ్యాజ్యం 'అమ్మ' కన్నుమూత
మూడు దశబ్దాల కిందట ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన మొట్టమొదటి మహిళా న్యాయవాది.. ఎన్నో ప్రజాహిత వ్యాజ్యాల ద్వారా న్యాయం కోసం పోరాడిన మహిళ.. మదర్ పిల్ ఆఫ్ గా పేరొందిన కపిల హింగోరాని(86) కన్నుమూశారు. 60ఏళ్ల పాటు న్యాయవాదిగా సేవలందించిన కపిల ముగ్గురు పిల్లలు అమన్, ప్రియ, శ్వేత కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. వీరందరూ కలసి సుప్రీంకోర్టులో సుమారు 100కు పైగా ప్రజాహిత వ్యాజ్యాలపై వాదనలు వినిపిచారు. ఎన్నో కీలక కేసుల్లో పేదవారు, ఉద్యోగులు, కార్మికుల కోసం వాదనలు వినిపించిన ఆమె ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు.