: పోలీస్ స్టేషన్ లోనే అధికారిని కాల్చేశారు


పోలీస్ స్టేషన్ ఆవరణలో తాగి గొడవ చేస్తున్న వారిని వారించినందుకు ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని వైశాలి జిల్లా చుద్వాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో జనవరి 1 అర్ధరాత్రి సమయంలో... స్టేషన్ ఆవరణలో గ్రామపెద్దతో పాటు మరికొందరు తాగి తందనాలు ఆడుతున్నారు. దీంతో స్టేషన్ ఇన్ ఛార్జి అనిల్ కుమార్ గొడవ కాస్త తగ్గించాలని అన్నారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామపెద్ద, అతని మిత్రులు స్టేషన్ ఇన్ ఛార్జి అనిల్ కుమార్ ను, అతనితో పాటు ఉన్న సహోద్యోగి కుమారుడ్ని తుపాకీతో కాల్చి చంపేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. బీహార్ లో రౌడీల రాజ్యం నడుస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం మరోటి అక్కర్లేదు.

  • Loading...

More Telugu News