: నేపాల్ తాత్కాలిక పీఎమ్ గా ఖిల్ రాజ్ రెగ్మి
నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఖిల్ రాజ్ రెగ్మి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కొన్ని రోజుల నుంచి ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి సమసిపోనుంది. ఆ తర్వాత మరో మూడు నెలల్లో నేపాల్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ఆ దేశ మూడు ప్రధాన పార్టీలతో పాటు యునైటెడ్ డెమోక్రటిక్ మదేశీ ఫ్రంట్ నిన్న సమావేశాన్నిఏర్పాటు చేశాయి. 'పదకొండు సూత్రాల ఒప్పందం' ప్రకారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో 63 సంవత్సరాల రాజ్ రెగ్మి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రెగ్మి నేపాల్ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్. దేశ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ షీతల్ నివాస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరవనున్నారని తెలుస్తోంది.