: ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇన్ఫోసిస్ 'క్రిస్'
ఇన్ఫోసిస్ క్రిస్ గా సుపరిచితులైన గోపాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. గతేడాది డిసెంబర్ లో ఇన్ఫోసిస్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న గోపాలకృష్ణన్ మరొక ఐటీ కంపెనీలో చేరతారని వార్తలు వినిపించినా.. ఎవరూ ఊహించని రీతిలో ఆయన ఆమ్ ఆద్మీలో చేరడం విశేషం. ఈ విషయాన్ని గోపాలకృష్ణన్ కూడా ధ్రువీకరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు దేశంలోనే విప్లవాత్మకమైనవని.. వాటిపట్ల తానెంతో ముగ్ధుడినయ్యానని చెప్పారు.