: గ్యాస్ ధర పెంపునకు నిరసనగా టీడీపీ ధర్నా


చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు కృష్ణాజిల్లా గొల్లపూడిలో నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరను విపరీతంగా పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పెనుభారం మోపుతోందన్నారు.

  • Loading...

More Telugu News