: పొడవు తలనీలాలు సమర్పిస్తే.. ఐదు లడ్లు ఫ్రీ..!
భక్తుల తలనీలాల ద్వారా వందల కోట్ల ఆదాయం కళ్లజూస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 31 సెంమీ పొడవు కురులు ఉన్న వ్యక్తులు తలనీలాలు సమర్పిస్తే వారికి 5 లడ్లు ఉచితంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. బాగా పొడవున్న కురులకు అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉండడంతో టీటీడీ ఈ ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టింది.
ఈ లెక్కన ఐదుగురు వ్యక్తులు తలనీలాలు సమర్పిస్తే ఓ కిలో వెంట్రుకలు అవుతాయట. అవి మార్కెట్లో రూ. 21, 800 ధర పలుకుతాయని తెలుస్తోంది. కాగా, టీటీడీ గతేడాది కురుల వేలం ద్వారా రూ. 200 కోట్లు ఆర్జించింది.