: ఇంకా టైముంది.. ఓపిక పట్టండి: అహ్మద్ పటేల్
మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారం ఢిల్లీ వరకు చేరింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని... టీమంత్రులు భావిస్తున్నారు. తెలంగాణ నేతలను సీఎం కిరణ్ ఖాతరు చేయడం లేదనే ఫీలింగ్ లో వారున్నారు. దీంతో అవసరమైతే శ్రీధర్ బాబుతో పాటే, అందరూ కలసి మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్టు సమాచారం.
దీనికి తోడు, ఢిల్లీ పెద్దలతో కూడా టీమంత్రులు ఫోన్ల ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాజీనామాలు మినహా గత్యంతరం లేదని వారు హైకమాండ్ కు చెప్పారు. దీంతో, సోనియాగాంధీ నమ్మిన బంటు అహ్మద్ పటేల్ టీమంత్రులను ఓదార్చే పనిలో పడ్డారు. ఇప్పటిదాకా జరిగింది ఏమీ లేదని, ఇంకా చాలా సమయం ఉందని, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలంతా ఓపికతో ఉండాలని అహ్మద్ పటేల్ వీరికి సూచించారు.