: పరుపులో 'పా....పా... పాము'!!


పరుపుగా పాము... ఎవరికుంటుంది. మనకు తెలిసినమేర దేవతల్లో మహావిష్ణువుకు ఉంటుంది. అలాకాకుండా వేరే ఎవరూ పామును పరుపుగా చేసుకుని పడుకున్న దాఖలాలు లేవు. మన విషయానికొస్తే పామును చూస్తే మనందరం ఆమడదూరం పారిపోతాం. ఇక పరుపుగా పామేంటి...! అలాంటి పడుకునే పరుపులో పాముంటే... ఆ ఊహకే ఒళ్లు జలదరిస్తోంది కదూ... కానీ రెండు నెలలుగా ఒక పాము పరుపులో ఉంటే... దానిపైనే నిద్రపోతోంది ఒక మహిళ. తీరా పాము ఉన్నట్టు తెలిసాక ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన హోలీ రైట్‌ అనే మహిళ ఒక పాత పరుపును కొనుక్కుని దాన్ని శుభ్రం చేసుకుని దానిపై రెండు నెలలుగా నిద్రపోతోందట. కానీ ఇటీవలే దానిలో ఒక పాము కనిపించడంతో హోలీ నిర్ఘాంతపోతోంది. నాలుగు అడుగుల పొడవున్న ఆ పాము ఆ పరుపులో ఎన్నాళ్లుగా ఉందో తమకు తెలియడం లేదని హోలీ చెబుతోంది. పాపం... పాము... పరుపులో ఏం అవస్థలు పడిందో కదూ!

  • Loading...

More Telugu News