: వారసత్వంగా వచ్చిన 'సమస్య'కు ప్రభుత్వ సాయం!
ఒక మహిళ చిత్రమైన సమస్యతో సతమతమవుతోంది. ఆమె పడుతున్న అవస్థను గమనించిన ప్రభుత్వం వారు ఆమెకు నెలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా.... పెద్ద పిరుదులను కలిగివుండడం. మనం కొంతమేర లావుగా ఉన్నా అలాంటి వాళ్ల అవస్థలు వర్ణనాతీతం. అలాంటిది అత్యంత వెడల్పైన పిరుదులను కలిగివుండే వాళ్ల అవస్థ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సమస్యతో సతమతమయ్యే ఒక మహిళకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది.
చికాగోకు చెందిన సారా మస్సే అనే మహిళకు ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన పిరుదులను కలిగివున్న మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఇంతకూ ఆమె పిరుదుల చుట్టుకొలత ఎంతో తెలుసా... అక్షరాలా ఏడు అడుగులు! ఇంతటి పొడవైన పిరుదులతో రికార్డు సృష్టించిన సారాకు ఈ రికార్డు వారసత్వంగా వచ్చిందట. అంతపెద్ద పిరుదులతో ఒక గదినుండి మరో గదిలోకి వెళ్లాలన్నా, కారులోకి ఎక్కి సీటుబెల్టు బిగించుకోవాలన్నా... చివరికి తనకు తగిన దుస్తులను కొనుక్కోవడానికి కూడా ఆమెకు తిప్పలు తప్పడంలేదట. ఆమె అనుభవిస్తున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని చికాగో ప్రభుత్వం ఆమెకు నెలకు రూ.76,817లను చెల్లిస్తోందట.