: మరో హిట్ కొట్టేందుకు 'సై' అంటున్న'గాంగ్నమ్ స్టైల్' ఫేమ్


కేవలం ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ కొట్టేసిన సౌత్ కొరియా సింగర్ సై (PSY) ఇప్పడు 'గాంగ్నమ్ స్టైల్' తరహాలోనే మరో పాట రూపొందిస్తున్నాడట. తనకు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం సంపాదించిపెట్టిన గాంగ్నమ్ స్టైల్ పాట కన్నా మిన్నగా ఈ గీతం ఉంటుందని సై అంటున్నాడు.

ఇంకేముంది, ఆడియో కంపెనీల దగ్గర్నుంచి, సీడీల రిటెయిల్ అమ్మకందార్ల వరకు అందరిలోనూ ఒకటే ఉత్కంఠ..! తాజా పాట ఎంత హిట్టవుతుందో, తమకెంత లాభాలు వస్తాయో అని వాళ్లు ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. సై తన నూతన గీతాన్ని ఏప్రిల్ 13న జరిగే ఓ కచేరీలో విడుదల చేయనున్నాడు.

కాగా, గత ఏడాది రిలీజైన గాంగ్నమ్ స్టైల్ పాట యూట్యూబ్ లో ఇప్పటివరకు 1 బిలియన్ (100 కోట్లు) పైగా హిట్స్ నమోదు చేసుకుంది. ఈ పాట  సైకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. పలువురు దేశాధ్యక్షులు, సినీ ప్రముఖులు అందరూ సై పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయినవాళ్లే!

  • Loading...

More Telugu News