: ఆ ఒక్క ఘటనతో.. ఇంతగా వేధించాలా?
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో తాము పన్నులు చెల్లిస్తున్నామంటూ ప్రైవేటు బస్సుల యజమానులు చెప్పారు. ప్రైవేటు ట్రావెల్స్ పై 50 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ రోజు తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వోల్వో బస్సు ప్రమాద ఘటనను ఆధారంగా చేసుకొని ఇంతలా వేధించాలా? ఇన్నాళ్లు సక్రమం అనిపించిన వ్యాపారం, ఇప్పుడు తప్పులా కనపడుతోందా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నామని నిరూపిస్తే వ్యాపారం మానుకొంటామని వారు తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్ తో ఒక్క బస్సును నడిపినట్టు నిరూపించినా తాము బస్సులన్నీ నిలిపివేస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు.