: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
సామాన్యుడి నెత్తిన మరో గ్యాస్ పిడుగు పడింది. గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. రాయితీ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. దాంతో, సిలిండర్ ధర రూ.419 నుంచి రూ.444కు చేరింది. అటు రాయితీ లేని సిలిండర్ (నాన్ సబ్సిడీ)పై రూ.217 పెరిగింది. అప్పుడు తొమ్మిది సిలిండర్ల తర్వాత రాయితీ లేని సిలిండర్ ధర రూ.1,109 నుంచి రూ.1326కు చేరింది. ఇక వాణిజ్య సిలిండర్ పై రూ.385 పెంచడంతో... దాని ధర రూ.1881 నుంచి రూ.2,266కు చేరింది.