: శాసనసభ సమయంలో శాఖల మార్పు అభ్యంతరకరం: మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
మంత్రులకు శాఖలు కేటాయించే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నదని, అయితే శాసనసభ జరిగే సమయంలో శాఖ మార్చడం అభ్యంతరకరమని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ బాబు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తున్నందునే శాఖ మార్చారని ప్రజలు అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.