: మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? పరిష్కారం ఇదిగో!
మోకాలి నొప్పితో బాధపడే రోగులకు దెబ్బతిన్న మోకాలి కార్టిలేజ్ ను మూలకణచికిత్సతో పునరుత్పత్తి చేయవచ్చని సౌత్ కొరియాకు చెందిన డాక్టర్ ఎన్.కె.కిమ్ తెలిపారు.
కార్టిలేజ్ లోపాలతో కీళ్లు అరిగిపోయి నడవలేకపోతున్న భూపతిరెడ్డి అనే 40 ఏళ్ల వ్యక్తికి మెడిసిటీ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా మూలకణ చికిత్స చేసి వైద్యులు విజయం సాధించారు. ఈ శస్త్రచికిత్సకు డాక్టర్ కిమ్ తో పాటు యూకేకి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు ఏఎం శెట్టి నేతృత్వం వహించారు.
తాజాగా ఆ వ్యక్తి మోకాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కార్టిలేజ్ లోపాలు, ఆస్టియో అర్థరైటిస్ తో బాధపడేవారికి మూలకణ చికిత్స ద్వారా పూర్తి ఆరోగ్యం కల్పించవచ్చని వైద్యులు తెలిపారు.