: సీఎం చర్యలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం: మంత్రి జానా


రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రికి సంక్రమించిన హక్కులను తాము ప్రశ్నించడం లేదని మంత్రి జానారెడ్డి అన్నారు. అయితే సీఎం కిరణ్ వ్యవహార శైలి రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని... దాన్ని మాత్రమే తాము తప్పుబడుతున్నామని చెప్పారు. ఈ రోజు గవర్నర్ నరసింహన్ తో టీమంత్రులు భేటీ అయిన తర్వాత, వీరంతా మళ్లీ జానా నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా, ప్రక్రియ మరింత వేగవంతమవుతోందని జానా చెప్పారు. అసెంబ్లీలో అందరూ తమ అభిప్రాయాలను చెప్పుకోవాలని సూచించారు. వీలైనంత త్వరలో టీబిల్లుపై చర్చను ముగించి, దాన్ని ఢిల్లీకి పంపడమే తమ తక్షణ కర్తవ్యమని చెప్పారు. ఈ నెల 3న మినిస్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News