: సీఎం క్యాంపు కార్యాలయంలో, చంద్రబాబు నివాసంలో కొత్త సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు సహా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. అందరూ సీఎంకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ఏడాది లో రాష్ట్ర ప్రజలకు సకలం సిద్ధించాలని కిరణ్ కోరుకున్నారు. అటు చంద్రబాబు నివాసంలోనూ కొత్త ఏడాది సంబరాలు జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర సందర్శకులు బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు.