: సరైన సమయంలో సమాధానమిస్తా: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీమంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభలో విభజన బిల్లుపై విధివిధానాల మేరకే నడచుకున్నానని తెలిపారు. ఈ రోజు టీమంత్రుల బృందం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు కొత్తగా కేటాయించిన వాణిజ్య పన్నుల శాఖను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోనని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలపై సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానని చెప్పారు.