: ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి: ఈటెల రాజేందర్
మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ శ్రీధర్ బాబును శాఖ మార్చి శాసనసభా వ్యవహారాలను, రాజ్యాంగాన్ని సీఎం ఉల్లంఘించారని అన్నారు. ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రాంత మంత్రులు సహాయనిరాకరణ చేయాలని ఆయన సూచించారు.