: 'వినాశకాలే విపరీతబుద్ధి'కి సంకేతం సీఎం వ్యవహారశైలి: మంత్రి జానా


తెలంగాణ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు నిర్ణయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తో భేటీ అనంతరం టీమంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ, జరుగుతున్న పరిణామాలను గమనించాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు, అసెంబ్లీ నడుస్తున్న తీరు, చర్చ జరగవలసిన అవసరాన్ని గమనించాల్సిందిగా గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

శ్రీధర్ బాబుపై సీఎం తీసుకున్న చర్యను తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారని... దీన్నొక పైశాచిక చర్యగా భావిస్తున్నామని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను 'వినాశకాలే విపరీతబుద్ధికి సంకేతంగా' భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ చర్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని... సీఎం నిర్ణయాలను హైకమాండ్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. టీమంత్రులంతా సమావేశమై రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని జానా తెలిపారు. ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా ఉండేందుకే సంయమనం పాటిస్తున్నామని జానా చెప్పారు. సీఎం చర్య తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News