: నేడు భారత పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల కొత్త అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ ఈ రోజు భారత పర్యటనకు రానున్నారు. గతేడాది నవంబర్ లో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గయూమ్ కు ఇదే తొలి అధికారిక విదేశీ పర్యటన. రేపు ప్రధాని మన్మోహన్ తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. గయూమ్ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల వృద్ధికి తగిన అవకాశంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటన జారీ చేశారు.