: గోవాలో ఫుల్ జోష్


గో..గో.. గోవా అంటేనే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాంటి నూతన సంవత్సర వేడుకల్లో గోవా మరింత మెరిసి మురిసిపోతుంది. సముద్రతీరాన అలల తాకిడిలో చక్కని సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. ఇసుక తిన్నెల్లోంచి సముద్ర అందాలను వీక్షిస్తూ, బాణాసంచా వెలుగుజిలుగుల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు... ప్రతి ఏడాది లక్షలాది పర్యాటకులు బారులు తీరుతారు. ఈ ఏడాది కూడా గోవాకు పర్యాటకులు పరుగులు తీశారు.

సుమారు 3 లక్షల మంది పర్యాటకులు గోవాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీచ్ లో ఎటు చూసినా జనం, సందడే సందడి. బుధవారం తెల్లవారు జాము వరకు పర్యాటకులు గానాబజానాతో సేదతీరారు. కొత్త సంవత్సరం ఆరంభం కాగానే బిగ్గరగా అరుస్తూ, ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

  • Loading...

More Telugu News