: ఢిల్లీలో నేటినుంచి ఉచిత మంచినీటి పథకం
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్లో ఒకటైన ఉచిత మంచినీరు నేటినుంచి అమలు కానుంది. ఈ మేరకు ఢిల్లీలో ఒక్కో కుటుంబానికి ఏడు వందల లీటర్ల మంచినీరు అందించనున్నారు. ఇందుకు సంబంధించి నిన్ననే (మంగళవారం) కేజ్రీవాల్ ఆదేశాలు కూడా జారీ చేశారు.