: ఫేస్ బుక్ సాయంతో బైక్ కొట్టేశారు!
ప్రతీదానికీ ఒకవైపు మంచి ఉన్నట్లే.. రెండోవైపు చెడు కోణం కూడా ఉంటుంది. చక్కటి సామాజిక సంబంధాలకు వారధిగా ఉపయోగపడే ఫేస్ బుక్.. లైంగిక వేధింపులకు, ఘర్షణలకు, చివరికి చోరీలకూ సాయపడుతోంది. కరీంనగర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అరుణ్(22) తన స్నేహితుడితో కలిసి ఫేస్ బుక్ లో చోరీ చేయడమెలాగో చూసి నేర్చుకుని మరీ ఓ బైక్ కొట్టేశాడు.
అరుణ్ హైదరాబాద్ లో ఉండే తన సోదరుడు వద్దకు వచ్చాడు. నగరంలోనే ఉండే తన స్నేహితుడు హేమంత్(23)తో కలిసి సోమవారం లంగర్ హౌజ్ కు వచ్చాడు. అక్కడ సెల్ ఫోన్ షాపు ముందున్న పల్సర్ ను వారు కొట్టేసి తీసుకెళ్లిపోయారు. కానీ, టైమ్ బ్యాడ్ పోలీసులకు దొరికిపోయారు. బైక్ చోరీలకు సంబంధించి ఫేస్ బుక్ లో పెట్టిన సీసీటీవీ ఫుటేజీలను చూసి తాము ఈ పని చేశామని విచారణలో చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు.