: పదవికాదు.. తెలంగాణే ముఖ్యం: శ్రీధర్ బాబు
తనకు పదవి ముఖ్యం కాదని, తెలంగాణ సాధనే ముఖ్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, శాఖ మార్పుకు సంబంధించిన సమాచారం తనవద్ద ఏదీ లేదని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.