: పబ్బులు, రెస్టారెంట్లపై కొరడా ఝుళిపించిన పోలీసులు


నిన్న రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత నిబంధనలు అతిక్రమించి నడుస్తున్న పబ్ లు, రెస్టారెంట్లపై దాడులు చేశారు. అంతే కాకుండా, అర్ధరాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ కేసులను భారీగా నమోదు చేశారు. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కేబీఆర్ పార్క్, నాగార్జున సర్కిల్, సికింద్రాబాద్, బేగంపేటతో పాటు పలుచోట్ల పోలీసులు పికెటింగ్ నిర్వహించారు.

  • Loading...

More Telugu News