: శ్రీధర్ బాబు మార్పుకు నిరసనగా కరీంనగర్ జిల్లా బంద్
మంత్రి శ్రీధర్ బాబు శాఖమార్పుపై తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఖరికి నిరసనగా నేడు కరీంనగర్ జిల్లా బంద్ కు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో కొత్త ఏడాది కరీంనగర్ జిల్లా వాసులు బంద్ తో ప్రారంభించారు. బస్సులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. విద్యా సంస్థలను కూడా మూత వేయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.