: రేపు రాజ్ భవన్ లో ప్రజా దర్బార్
నూతన సంవత్సరం సందర్భంగా రేపు (బుధవారం) రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ప్రజలను కలువనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలు నేరుగా గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.