: రాహుల్ నివాసం ఎదుట బీజేపీ ఆందోళన


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ఎదుట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ను పదవి నుంచి తప్పించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు దాటి, లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఆందోళనకారులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒక ప్రైవేటు విద్యుత్ సంస్థ నుంచి వీరభద్రసింగ్ ముడుపులు తీసుకున్నారని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News