: సమస్య పరిష్కారంపై చిత్తశుద్ది... కాగ్ తో సాయంత్రం క్రేజ్రీవాల్ సమావేశం
ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా హామీ అమలుపై నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి విద్యుత్ సమస్యపై దృష్టి సారించారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విద్యుత్ ఖాతాలపై చర్చించేందుకు కాగ్ తో భేటీ కానున్నారు. కేజ్రీవాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ కాగ్ తో సమావేశమై ప్రజా సమస్యలపట్ల తన చిత్తశుద్ధిని కేజ్రీవాల్ నిరూపించుకుంటున్నారు.